Dhanush : ధనుష్ ‘DxV’ క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయే ఏకైక స్టార్ హీరో ధనుష్. రీసెంట్గా ‘కర’ సినిమాతో పలకరించిన ధనుష్, ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఓమ్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే తమిళరసన్ పచ్చముత్తు, మారి సెల్వరాజ్ వంటి క్రేజీ దర్శకులు ఆయన కోసం లైన్లో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ తన సోషల్ మీడియా ఖాతాలో వదిలిన ఒక అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ధనుష్ తన ఎక్స్ ఖాతాలో ‘DxV‘ అనే అక్షరాలతో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. జూలై 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని డేట్ లాక్ చేశారు. అంతరిక్షం లేదా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌ను తలపించేలా ఉన్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ రకరకాల అంచనాలు వేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ డైరెక్ట్‌గా ఈ పోస్టర్ వేసి ఉంటే ఈజీగా గెస్ చేసేవారేమో కానీ, ధనుష్ స్వయంగా ఈ సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడంతో నెట్టింట విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ‘DxV’ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ప్రధానంగా రెండు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ ‘V’ అంటే దర్శకుడు వెంకట్ ప్రభు అని, వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ లేదా టైమ్ ట్రావెల్ ఎంటర్టైనర్ రాబోతుందని మెజారిటీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. గతంలో శివకార్తికేయన్‌తో అనుకున్న కథను ఇప్పుడు ధనుష్‌తో చేయబోతున్నారనే బజ్ కూడా ఉంది. మరో ఆసక్తికరమైన ఏంటంటే గతేడాది ’12త్ ఫెయిల్’ సినిమాతో సంచలన విజయం అందుకున్న బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రాతో ధనుష్ చేతులు కలపబోతున్నారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. దీనితో పాటు ధనుష్ తన నెక్ట్స్ డైరెక్టోరియల్ సినిమాను అనౌన్స్ చేస్తున్నారా? లేక గతంలో చర్చకు వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘వేల్పారి’ గురించా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ‘DxV’ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!