Site icon NTV Telugu

Dhanush: అంత సైలెంట్ గా ఎలా కంప్లీట్ చేసావ్ అన్న?

Dhanush

Dhanush

కోలీవుడ్ పాన్ ఇండియా యాక్టర్ ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్, మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా, ఆనంద్ ఎల్ రాయ్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ధనుష్… చెన్నై టు ముంబై వయా హైదరాబాద్ తిరుగుతూ ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనని తాను కంప్లీట్ గా సినిమాలకి డేడికేట్ చేసుకునే ధనుష్… ఈ సినిమాల్లో హీరోగా నటిస్తూనే తన డైరెక్షన్ లో ఒక మూవీని కంప్లీట్ చేసేసాడు. సింగర్, రైటర్, ప్రొడ్యూసర్ అయిన ధనుష్… పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకున్న ధనుష్, తన 50వ సినిమాని సొంత డైరెక్షన్ లోనే చేస్తుండడం విశేషం.

D50 అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2023 జనవరిలో ప్రకటించిన ఈ సినిమా జులై నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లింది. ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, నిత్యా మీనన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ మూవీ షూటింగ్ ని ధనుష్ కంప్లీట్ చేసేసాడు. D50 షూటింగ్ కంప్లీట్ అయ్యింది, నా విజన్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అంటూ ధనుష్ ట్వీట్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో అంత సైలెంట్ గా, అంత ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేసావ్ అన్నా అంటూ షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉండి కూడా తన డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం చిన్న విషయం కాదు.

Exit mobile version