సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసిన ధనుష్… లేటెస్ట్ గా అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా చేసాడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన వాళ్లు… ధనుష్ లిస్టులో మూడో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన ఫ్యాన్స్ ధనుష్ యాక్టింగ్ ని ఫిదా అవుతున్నారు. ఒక మంచి యాక్టర్ కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తగిలితే ఎలా ఉంటుందో కెప్టెన్ మిల్లర్ సినిమా చూస్తే తెలుస్తుంది అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ క్రిటిక్స్ కూడా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శివ కార్తికేయన్ తో క్లాష్ లో రిలీజైన కెప్టెన్ మిల్లర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ గానే నిలబడింది.
పండగ సీజన్ ని క్యాష్ చేసుకుంటూ కెప్టెన్ మిల్లర్ సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ని చేరుకుంది. ఫెస్టివల్ సీజన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కెప్టెన్ మిల్లర్ సినిమా ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు. లాంగ్ రన్ మైంటైన్ చేస్తే మాత్రం కెప్టెన్ మిల్లర్ సినిమా ధనుష్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ. సంక్రాంతికే తెలుగులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగులో ఎక్కువ చిత్రాలు రిలీజ్ కి ఉండడంతో జనవరి 14న రిలీజ్ కానుండా జనవరి 25కి వాయిదా పడింది. ఈ సినిమాని తెలుగులో జనవరి 25న రిలీజ్ చేయబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి కెప్టెన్ మిల్లర్ సినిమాని రిలీజ్ చేయబోతున్నాయి.
