Dhanush Birthday Special : విలక్షణమే ధనుష్ కు సలక్షణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush Birthday Special:
తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. అలాంటి తెలివైన నటుడు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలచిన ధనుష్, రాబోయే చిత్రాల్లోనూ విలక్షణమైన పాత్రలతో సాగే ప్రయత్నంలో ఉన్నారు.
ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా. 1983 జూలై 28న మద్రాసులో జన్మించారు ధనుష్. తమిళ దర్శకనిర్మాత, సంగీత దర్శకుడు అయిన కస్తూరి రాజా చిన్నకొడుకు ధనుష్. పీలగా కనిపించే ధనుష్ లో మంచి నటుడు ఉన్నాడని గుర్తించింది కస్తూరి రాజాయే. ఇక ఆయన పెద్దకొడుకు సెల్వరాఘవన్ రచయిత, దర్శకుడు. ధనుష్ తొలి చిత్రం ‘తుల్లువదో ఇలమై’ చిత్రానికి అన్న సెల్వరాఘవన్ కథ సమకూర్చగా, తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించారు. తరువాత వచ్చిన “పొల్లాదవన్, యారాడీ నీ మోహిని” చిత్రాలు ధనుష్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆ తరువాత నుంచీ గాయకునిగా, గీతరచయితగా, నిర్మాతగా కూడా ధనుష్ తన ప్రతిభను చాటుకుంటూ సాగారు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ధనుష్ నటించిన హిందీ చిత్రం ‘రాంఝనా’ కూడా ఆయనలోని నటుణ్ణి ఉత్తరాది వారికి పరిచయం చేసింది. తరువాత అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ స్టార్ తో నటిస్తూ ధనుష్ ‘షమితాబ్’లో తనదైన బాణీ పలికించారు. ఇక ధనుష్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ‘రఘువరన్ బి.టెక్.’తో ధనుష్ తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. ‘ఆడుకాలం’ చిత్రంతో తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన ధనుష్, మూడేళ్ళ కిందట వచ్చిన ‘అసురన్’తో మరో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. కిందటేడు వచ్చిన ధనుష్ చిత్రం ‘జగమే తంత్రం’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. అక్షయ్ కుమార్ తో ధనుష్ నటించిన హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ అంతగా అలరించలేక పోయింది. ‘మారన్’ సైతం పెద్దగా మురిపించలేదు. ధనుష్ నటించిన ఇంగ్లిష్ మూవీ ‘ద గ్రే మేన్’ ఈ నెల 15న థియేటర్లలోనూ, 22న నెట్ ఫ్లిక్స్ లోనూ వెలుగు చూసింది. ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రాంబలమ్’ ఆగస్టు 18న విడుదల కానుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘నానే వరువాన్’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోన్న ‘సార్’, ‘వాతి’ కూడా తుదిమెరుగుల్లో ఉన్నాయి. ఈ చిత్రాలన్నిటా ధనుష్ విలక్షణ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమాలు ధనుష్ కు ఏ స్థాయిలో సంతృప్తిని అందిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!