NTV Telugu Site icon

Danush, Surya: ధ‌నుష్‌,సూర్య కాంబోలో వెంకీ అట్లూరీ పాన్ ఇండియా మూవీ ?

Untitled Design (9)

Untitled Design (9)

తమిళ స్టార్ హీరోలు సూర్య, ధనుషక్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. ఇద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వీరు నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. ముఖ్యంగా యూత్ లో ఈ హీరోలకు మస్త్ క్రేజ్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో సౌత్ ఇండ‌స్ట్రీ లో పాన్ ఇండియా చిత్రాల హ‌వా ఎలా నడుస్తుందో తెలిసిందే. సోలో ప్రయ‌త్నాలు కొన్నైతే…మ‌ల్టీస్టార‌ర్ రూపంలో మ‌రికొన్ని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి ధ‌నుష్‌-సూర్య కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ధనుష్-సూర్య క‌ల‌యిక‌లో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి భారీ పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ మూవీ తీయడానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ చిత్రానికి ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ కూడా అనుకున్నట్లుగా వినిపిస్తుంది. ద‌ర్శకుడిగా వెంకీ అట్లూరి ‘తొలి ప్రేమ’, ‘సార్’, ‘ల‌క్కీ భాస్కర్’ లాంటి క్లాసిక్ హిట్లు అత‌డి ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే అతను వీరిద్దరితో సినిమా తీయగలడనే చెప్పవచ్చు. కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

థనుష్ కి సోలోగా హిందీ చిత్రాలు చేసిన అనుభ‌వం ఉంది. యూత్ పుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా అక్కడ త‌న‌కంటూ ప్రత్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇక సూర్య సౌత్ లో సూప‌ర్ స్టార్ అయినప్పటికి, హిందీ మార్కెట్ తక్కుద. ఇటీవ‌లే పాన్ ఇండియాలో ‘కంగువ’ చేసాడు. కానీ ఆశించిన ఫ‌లితాన్నివ్వలేదు. ఈ నేప‌థ్యంలోసూర్య.. ధ‌నుష్ తో సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు వినిపిస్తోంది. అదే జ‌రిగితే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుంది.