Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ..

  • చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ..
  • దిల్ రాజు ప్రొడక్షన్‌లో ‘‘హే కన్నమ్మ’’ సినిమా..
Dhanashree Verma

Dhanashree Verma

Dhanashree Verma: భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహన్ మాజీ భార్య, డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె త్వరలో తెలుగు ప్రేక్షకులు ముందుకు హీరోయిన్‌గా రానున్నారు. ధనశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ‘హే కన్నమ్మ’ ఫస్ట్ పోస్టర్, అఫీషియల్ టీజర్ రిలీజైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమా వస్తోంది. హే కన్నమ్మ’ ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. ధనశ్రీతో పాటు యశ్వంత్ మాస్టర్, కార్తీక మురళీధరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

ధనశ్రీ తన కొత్త ప్రయాణాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్, టీజర్ షేర్ చేస్తూ హీరోయిన్‌గా తన తొలి సినిమా టాలీవుడ్‌‌లో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. తన సినిమా పోస్టర్‌ను షేర్ షేస్తూ.. ‘‘ఆ క్షణం రానే వచ్చింది. కథానాయికగా నా మొదటి చిత్రం.. తెలుగు చిత్రసీమలో నా తొలి అడుగు. ఇది దిల్‌రాజు ప్రొడక్షన్స్‌తో ప్రారంభమవుతోంది. ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది? ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఇందులో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం. మీరందరూ ఈ చిత్రాన్ని వెండితెరపై చూడటం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని రాశారు. ఈ సినిమా హీరోయిన్‌గా తనను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కామెంట్ చేశారు. ధనశ్రీ యజ్వేంద్ర చాహల్ భార్యగా వార్తల్లో నిలిచారు. వీరిద్దరు 2020లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2025లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.