NTV Telugu Site icon

Dhamaka Mass Cracker: నేనొక పెద్ద శాడిస్ట్ ను అంటున్న రవితేజ

Mass

Mass

Dhamaka Mass Cracker: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధమాకా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్ దీపావళి కానుకగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. రవితేజ తనదైన కామెడీతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. “నేను మీలో విలన్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు.. కానీ నేను యాక్షన్ లో ఉన్నప్పుడు శాడిస్ట్ ని” అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

కథ మొత్తం రివిల్ చేయకుండా రవితేజ పాత్రను మాత్రమే పరిచయం చేసినట్లు కనిపిస్తోంది. ఒక పక్క కామెడీతో నవ్విస్తూనే.. ఇంకోపక్క యాక్షన్ లో పిచ్చెక్కిస్తున్నాడు రవితేజ. ఇక మధ్యలో శ్రీలీల షాట్స్ చూస్తుంటే ఆమె పాత్ర కూడా ముఖ్యమైనదే అని తెలుస్తోంది. ఇక చివర్లో అట్నుంచీ ఒక బుల్లెట్ వస్తే.. ఇట్నుంచి దీపావళి అని చెప్పడంతో టీజర్ ముగిస్తూ అందరికి దీపావళీ శుభాకాంక్షలు చెప్పారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో రవితేజకు ధీటుగా విలనిజాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు మలయాళ నటుడు జయరామ్..టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్ ప్రెజెంటేషన్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజా హిట్ టాక్ ను అందుకుంటాడో లేదో చూడాలి.