కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. మార్చ్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ… ఇప్పటికే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. దేవర యాక్షన్ ఎపిసోడ్స్ గురించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ బయటకి వచ్చింది… ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కోసం తారక్ గత కొన్ని రోజులుగా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ముంబాయి నుంచి వచ్చిన ట్రైనర్ల నెపథ్యంలో సముద్ర గర్భంలో యుద్ధానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. షూట్ స్టార్ట్ చేసిన కొరటాల శివ… అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ ని టెర్రిఫిక్ గా షూట్ చేస్తున్నాడు. దాదాపు 20 రోజుల పాటు జరిగిన ఈ హ్యూజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటో బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
“నౌటీక్యామ్ అర్రి అలెక్సా మినీ” కెమెరాతో ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో కెమెరా, సెట్ ఉంది కానీ ఎన్టీఆర్, ఇతర ఆర్టిస్టులు లేరు. ఈ అండర్ వాటర్ ఎపిసోడ్ తో దాదాపు యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యి టాకీ పార్ట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోను నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి… నెక్స్ట్ వార్ 2లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో దేవర సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. మరి జనతా గ్యారేజ్‌తో రీజనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల… పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
