Site icon NTV Telugu

Devara: దేవర టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.. ?

Devara

Devara

Devara:ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకోపక్క అప్డేట్ ఇవ్వమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ కూడా చేస్తున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర టీజర్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీజర్ అంటే.. టీజర్ అని చెప్పలేం కానీ, సినిమా రేంజ్, క్వాలిటీ, జానర్ పరిచయం చేసే గ్లింప్స్ అని చెప్పుకొస్తున్నారు. అసలు శివ కొరటాల ఈ గ్లింప్స్ తోనే ప్రభంజనం సృష్టించబోతున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో .. అలానే దేవర కనిపించబోతున్నాడట. ఇక ఈ గ్లింప్స్ కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. జనవరి 1 నుంచి సంక్రాంతి లోపు ఎప్పుడైనా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 5 న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version