NTV Telugu Site icon

Devara: ఇండియాలో ల్యాండ్ అయిన దేవర.. ఇక మొదలెట్టడమే

Ntr

Ntr

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర సినిమాను ఎంత కష్టపడి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమా తరువాత వచ్చే సినిమా ప్లాప్ టాక్ అందుకుంటుందని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ఇక ఇంకోపక్క దేవర డైరెక్టర్ కొరటాల శివ సైతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ కాంబోలో వస్తున్న దేవరను ఎలాగైనా హిట్ కొట్టించాలని ఈ కాంబో ట్రై చేస్తోంది. ఇందుకోసం స్టార్ క్యాస్టింగ్ తో పాటు ఎక్కడ చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది గా..

వారం క్రితమే షెడ్యూల్ ఫినిష్ చేసిన ఎన్టీఆర్.. దుబాయ్ కు వెకేషన్ కు వెళ్ళాడు. అక్కడే పది రోజులు ఉంటాడని టాక్ వచ్చింది. కానీ, ఎన్టీఆర్.. నేడు ఇండియాకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే జూలై 3 నుంచి కొత్త షెడ్యూల్ ను మొదలుపెడుతున్నారట. అందుకే తారక్ ఇండియాకు వచ్చినట్లు సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ లో పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట. దానికోసం పీటర్ హెయిన్స్ రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్ ను త్వరత్వరగా పూర్తిచేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లో టాకీ పార్ట్ మొదలుకానున్నది అని టాక్. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్.. రాజమౌళిసెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

Show comments