NTV Telugu Site icon

Devara: గోవాలో దేవర యాక్షన్.. ఓ రేంజ్ లో ఉండబోతున్నదంట

Ntr

Ntr

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న దేవర .. మొదటి పార్ట్ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం చిత్ర బృందం మొత్తం వారం రోజుల క్రితం గోకర్ణ షిఫ్ట్ అవుతున్నారు అని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే దానికన్నా ముందే గోవాలో రెండు రోజుల షూటింగ్ ను ప్లాన్ చేశారు.

Renu Desai: తిడితే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. మమ్మల్ని లాగకండి

ప్రస్తుతం గోవాలో యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఇప్పుడు జాన్వీ కపూర్ పై కొన్ని కీలక సన్నివేశాలను కొరటాల షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గోవాలో షూట్ పూర్తికాగానే గోకర్ణ షిఫ్ట్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. కొరటాల.. ఈ సినిమాను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఒక చిన్న తప్పు కూడా దొర్లకుండా ఎంతో జాగ్రత్తగా శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.