Site icon NTV Telugu

Devara : దేవర లెక్క 1000 కోట్ల నుంచే.. ఇదిగో ప్రూఫ్!

Devara Part 1

Devara Part 1

Devara Rights Became Hot Topic in Tollywood: టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్‌ను శరవేగంగా జరిపినా కుదరక పోవడంతో అక్టోబర్ పదికి వాయిదా వేశారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ బిజినెస్ కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేయగా థియేట్రికల్ రైట్స్‌ కూడా ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ తో కలిసి అనిల్ తడానీ ఏఏ ఫిలిమ్స్ సంస్థ దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి.

Pushpa2 : పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ ఇది..

ఆ సంస్థలు అంత ఈజీగా ఫ్రెండ్ షిప్ కోసమో మొహమాటానికో రంగంలోకి దిగే సంస్థలు కాదు. ఫక్తు వ్యాపార సంస్థలు, లాభ పడతామని అనుకుంటే తప్ప రంగంలోకి దిగవు. ఇక ముందే అన్ని బాషల ఆడియో రైట్స్ ప్ర‌ముఖ మ్యూజిక్‌ సంస్థ ‘టీ సిరీస్’ సొంతం చేసుకుంది. త ధ‌ర‌కు అమ్ముడైన‌ విష‌యం మాత్రం బయటకు రాలేదు కానీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం. ఆర్ఆర్ఆర్ స్టార్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో కావడంతో అవి ఎన్ని కోట్లు అనేది కూడా చెప్పలేనంత రేంజ్ లో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇక ఓవర్సీస్ రైట్స్‌ను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఓన్లీ ఓవరీస్ కోసం యూనిట్‌కు సందరు సంస్థ ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు అంటే యూఎస్ కరెన్సీలో 3.3 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ లెక్కన చూస్తుంటే త్రివిక్రమ్‌ చెప్పినట్టు ‘దేవర నామ సంవత్సరం’ అనేలా ఈ రైట్స్ కనిపిస్తున్నాయి. ఆయన అన్నట్టు వెయ్యి కోట్ల నుంచి కలెక్షన్స్ లెక్కలు మొదలు పెట్టాలేమో? అనేంతగా ఇప్పుడు ఈ సినిమా మీద బజ్ కూడా పెరుగుతోంది.

Exit mobile version