Site icon NTV Telugu

Devara Pre Release Event Cancelled: షాకింగ్ : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

Devara Event Cancelled

Devara Event Cancelled

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయబడింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నోవోటెల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు టీం సిద్ధమైంది. అందులో భాగంగానే అభిమానులకు కొన్ని పాసులు జారీ చేశారు. అయితే పాసులు జారీ చేసిన దానికి మించి అభిమానులు, వేదిక వద్దకు చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో నోవోటేల్ అద్దాలు ధ్వంసం కావడం మాత్రమే కాదు ఎస్కలేటర్స్ సైతం ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వహించడం కష్టమంటూ హోటల్ యాజమాన్యం చేతులెత్తేసింది.

Shankar: నా కాపీరైట్ నవలను ఎత్తేశారు.. శంకర్ కౌంటర్ ‘దేవర’ కేనా?

వెంటనే రంగంలోకి దిగిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయస్ మీడియా, కనీసం ఎన్టీఆర్ మాట్లాడడానికి అయినా అవకాశం ఇప్పించాలని యాజమాన్యంతో పాటు పోలీసులను కూడా కోరింది. అయితే పోలీసులు కూడా అభిమానులను క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. కొంతవరకు క్లియర్ చేసిన తర్వాత స్టేజి మీద బారికేడ్లు అడ్డం కట్టారు. ఎన్టీఆర్ ఒకవేళ వస్తే ఆ బారికేడ్ల వెనకాల నిలబడి మాట్లాడించి పంపించాలని ప్లాన్ చేశారు. అయితే ఎన్టీఆర్ లోపలికి వచ్చే పరిస్థితులు కూడా లేకపోవడంతో, ఎట్టకేలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రేపు ఒక మీడియా సమావేశాన్ని సినిమా యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి జరిగిన పరిణామాలను మీడియా ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. అయితే మీడియా సమావేశానికి సంబంధించి ఈ ఆర్టికల్ రాసి ఎప్పటికీ ఎలాంటి సమాచారం లేదు.

Exit mobile version