Site icon NTV Telugu

Devara Part 1: వాయిదా పడ్డ దేవర, ఎన్టీఆర్ కీలక ప్రకటన.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

Devara Part 1

Devara Part 1

Devara Part 1 to Release on 10th october for dasara: గత కొద్దికాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావలసిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ దసరా నవరాత్రుల చివరి రోజు, ఇక 12వ తేదీ దసరా పండుగ జరుపుకోబోతున్నారు.. ఒక దెబ్బకు ఆరు నెలలు వాయిదా వేసినా కరెక్ట్ గా దసరాకి సినిమాని రిలీజ్ చేసేలా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఇక దసరా సెలవులతో కలెక్షన్స్ కలిసి వచ్చే విధంగా పదో తేదీ అంటే గురువారం నాడు సినిమా రిలీజ్ చేస్తున్నారు.

TG Vishwa Prasad: అమెరికాలో చిరంజీవికి సన్మానం..ఆనందంగా ఉందన్న విశ్వ ప్రసాద్

శుక్రవారం నవరాత్రుల చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా సెలవు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 12వ తేదీ దసరా కావడంతో ఆ రోజు సెలవు కలిసి రానుంది. తర్వాత ఆదివారం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవనుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ముందు ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నామని తర్వాత ప్రకటించారు. ఈ సినిమాని కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాతలో నటిస్తున్నాడు.

Exit mobile version