NTV Telugu Site icon

Devara Glimpse: ఆ రక్తపు అలలు ఏంటయ్యా? హైపెక్కించి చంపేస్తారా?

Devara Movie

Devara Movie

Devara Glimpse update with Blood Waves Creating Hype: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకి వచ్చినా జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇక సినిమా యూనిట్ కూడా ఎప్పటికప్పుడు హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు. గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాకున్ భారీ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి కొన్నిరోజుల ముందే అభిమానులకు కనుక ఇచ్చేందుకు మూవీ నుంచి గ్లింప్స్ ని తీసుకు వచ్చేందుకు సినిమా యూనిట్ అంతా సిద్ధం చేసింది. జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే డేట్ చెప్పారు కానీ ఇప్పటిదాకా కరెక్ట్ టైం చెప్పలేదు. తాజాగా ఆ సమయాన్ని అనౌన్స్ చేస్తూ ఒక నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Sankranthi Films: సంక్రాంతి సినిమాల బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే?

ఆ గ్లింప్స్ లో ఎన్టీఆర్ తన రక్తంతో కూడిన ఆయుధాన్ని రక్తపు నీటిలో కడుగుతూ కనిపించాడు. ఆ రక్తంతో మొత్తం కెరటాలు అంతా ఎర్రగా కనిపిస్తుండగా ఆలా చూస్తుంటే 8న రాబోయే గ్లింప్స్ పై మరిన్ని అంచనాలు పెరుగుపోతున్నాయి. ఇక ఈ గ్లింప్స్ ని జనవరి 8న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఆ గ్లింప్స్ తో ఇంకెంత హైప్ ఎక్కించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చే మొదటి హ్యూజ్ అప్డేట్ కావడంతో ఈ గ్లింప్స్ కి కూడా ఒక అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా అభిమానులయితే అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనబడనున్నారు.