NTV Telugu Site icon

Devara: దేవర గ్లింప్స్.. సముద్రం ఎరుపెక్కాలా

Ntr

Ntr

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్.

మొదటినుంచి కూడా ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా ఆసక్తి కనబరుస్తున్నాడు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి రాజమౌళి సినిమా తర్వాత హిట్ అందుకోవాలని. ఇంకొకటి శివ కొరటాలకు మంచి హిట్ అందివ్వాలని దీనికోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఈ అయితే చూడాలనుకున్నారో కొరటాల అలానే చూపించాడు. మరణ మాస్ విధ్వంసం చూపించేశాడు. ఇప్పటివరకు దేవర గురించి చెప్పిన ప్రతి మాట నిజమే అని ఈ గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ మరణ మాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అనిరుధ్ మ్యూజిక్.. కొరటాల మేకింగ్.. ఎన్టీఆర్ యాక్టింగ్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసేలా ఉంది. చివర్లో ఎన్టీఆర్ “ఈ సముద్రం చేపలను కంటే కత్తులను, నెత్తురును ఎక్కువ చూసి ఉండాది.. అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు” అంటూ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్.. అదిరిపోయింది ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.