Devara: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని సంతోషంలో మునిగితేలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక నిమిషం 20 సెకన్లు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం యాక్షన్ తో నింపేశాడు శివ కొరటాల. సముద్రాన్ని రక్తంతో కడిగినట్లు ఉంది. కొంతమంది రౌడీలు సముద్రంలోకి చొరబడి.. కొన్ని బాక్సులను తీయడానికి ప్రయత్నించగా.. దేవర.. D ఆకారంలో ఉన్న కత్తితో ఎలాంటి రక్తపాతాన్ని చూపించాడో శాంపిల్ గా ఈ గ్లింప్స్ ను వదిలాడు.
Devara: దేవర గ్లింప్స్.. సముద్రం ఎరుపెక్కాలా
ఇక ఎన్టీఆర్ లుక్, ఆ ఫైట్ అంతా ఒక ఎత్తు అయితే.. కొరటాల శివ టేకింగ్ వేరే లెవెల్. ముఖ్యంగా.. సగం చందమామను.. ఎన్టీఆర్.. విలన్స్ రక్తంతో పూర్తి చేసిన షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రస్తుతం ఈ షాట్ నెట్టింట వైరల్ గా మారింది. గ్లింప్స్ మొత్తం ఒక ఎత్తు.. ఈ ఒక్క షాట్ ఒక ఎత్తు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లుక్ ఊర మాస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ షాట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏప్రిల్ 5 న దేవర మొదటి భాగం రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో కొరటాల- ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.
