Deewana : సెన్సార్ తీరుపట్ల కంటతడి పెట్టుకున్న దీవాన దర్శకుడు

Deewaana

Deewaana

మెయిల్, శుభం వంటి చిన్న చిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఏ బాయ్ నెక్స్ట్ డోర్ హీరోగా పరిచయమైన హర్షిత్ రెడ్డి సోలో హీరోగా చేసిన ఓ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీనే ‘దీవాన’. ఇక ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓ వైపు పాజిటివ్ రివ్యూస్ తో అలాగే జెన్యూన్ మౌత్ టాక్ అండ్ డే బై డే మంచి బుకింగ్స్ తో దూసుకెళ్తుండగా మరో పక్క ఈ చిత్రానికి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన A రేటింగ్ వల్ల నష్టం జరుగుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెన్సార్ వారు ఇచ్చిన ఏ రేటింగ్ వల్ల సినిమా చూడటానికి వెళ్ళే ప్రేక్షకుడికి ఒపీనియన్ మారిపోయి మూవీ ఓపెనింగ్స్ కి దెబ్బ పడిందని మేకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ఇవాళ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మూవీ మ్యూజిక్ డైరెక్టర్  మాట్లాడుతూ ‘ సెన్సార్ ఇచ్చిన రేటింగ్ ను ఉద్దేశించి కొన్ని పెద్ద చిత్రాలకు ఎంత బూతు డైలాగులు ఉన్నా ఎలాంటి బూతు సీన్స్ ఉన్న U/A  ఇస్తారు. విచిత్రంగా అలాంటి సినిమాలు పట్ల సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది కానీ ఆ పెద్ద సినిమాలు పై ఎవరికి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. అదే మేము తీసిన ఈ చిన్న సినిమాలో మాత్రం ఎటువంటి వల్గారిటీ లేకపోయినా మా చిత్రానికి సెన్సార్ వాళ్ళు A రేటింగ్ ఇచ్చారు. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తించి తమ చిత్రానికి తప్పకుండా సపోర్ట్ చెయ్యాలని కోరుతున్నాను’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్న సమయంలో చిత్ర దర్శకుడు కంటతడి పెట్టుకున్నారు. చిత్ర నిర్మాత వాసు దేవ్ కొప్పీనేని ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మరింత మందికి రీచ్ అయ్యేలా సింగిల్ స్క్రీన్స్ లో టిక్కెట్ ధర రూ. 100గా ఫిక్స్ చేయనున్నట్లు ప్రకటించారు.

×
×
Ad