NTV Telugu Site icon

Deepthi Sunaina: కొత్త కారు కొన్న దీప్తి సునైన.. కొత్త అనుమానాలు?

Deepthi Sunaina Responds To Accident Rumors

Deepthi Sunaina Responds To Accident Rumors

Deepthi Sunaina Buys Toyota Hilux Car: దీప్తి సునయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. అప్పుడెప్పుడో వచ్చిన డబ్స్మాష్ లో వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఆమె తర్వాత వచ్చిన టిక్ టాక్ తో దాన్ని వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళింది. ఇక యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ మరింత గుర్తింపు సంపాదించుకున్న ఆమెకు బిగ్ బాస్ అవకాశం ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఆ బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైంది. బిగ్ బాస్ లో తనీష్ తో ప్రేమాయణం నడిపినట్టుగా అతనికి క్లోజ్ గా ఉన్న ఆమె ఆ తర్వాత సీజన్లో ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ తన ప్రియుడు అనే విషయం వెల్లడించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత హౌస్ లో షణ్ముఖ్, సిరి క్లోజ్ గా మూవ్ అవ్వడంతో షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది.

Allu Arjun: అల్లు అర్జున్ పై కేజీఎఫ్ నటుడు కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతానికి మళ్ళీ కవర్ సాంగ్స్ తో పాటు పలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆమె తాజాగా ఒక కొత్త కారు కొనుగోలు చేసింది. అయితే అందరిలాగా బెంజ్, ఆడి అంటూ లగ్జరీ బ్రాండ్స్ జోలికి వెళ్లకుండా టయోటాలో హై లక్స్ అనే వాహనాన్ని కొనుగోలు చేసింది. ఈ వాహనం స్పెషాలిటీ ఏమిటంటే డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ఏసీ క్యాబిన్లో ప్రయాణించే విధంగా అవకాశం ఉంటుంది. అలాగే వెనుక సరుకు రవాణాకి కూడా వేరే క్యాబిన్ ఉంటుంది..సోషల్ మీడియాలో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఆమెకు అలాంటి వెహికల్ తో పని ఏంటి? అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇలాంటి వాహనాలను ఫారెన్ లో క్యారవాన్లుగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. బహుశా అలా ఏమైనా ట్రై చేస్తందేమో తెలియదు. ఇక ఈ వాహనం ఖరీదు విషయానికి వస్తే బేసిక్ మోడల్ 30 లక్షలు పలుకుతుండగా హై ఎండ్ మోడల్ 37 లక్షల వరకు ఉంది.

Show comments