NTV Telugu Site icon

Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!

Deepika

Deepika

Deepika Padukone says she Slept In Cabs With Suitcase During Struggle Days: సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో సత్తా చాటిన హీరోయిన్స్ లిస్టు తీస్తే అందులో దీపికా పదుకొనె పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఆ లిస్టు మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ నటీమణుల లిస్టులో కూడా దీపికా పదుకొణె పేరు చేర్చబడింది. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్‌హిట్లు అయ్యాయి, కేవలం బాలీవుడ్‌లోనే కాదు, ఆమె హాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటింది. అంతెందుకు ఈ రోజున సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా కూడా నిలిచింది. అయితే ఇక్కడ దీపిక ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఆమె కూడా సినిమాల్లోకి రాకముందు చాలా కష్టపడ్డానని స్వయంగా వెల్లడించింది. దీపికా పదుకొనే వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్ట్రగుల్ డేస్ గురించి మాట్లాడింది. ఆమె తాను ఒంటరిగా కొత్త నగరానికి వచ్చి తన బ్యాగ్‌తో ఎక్కడక్కడ ఎలా తిరుగాడానో చెప్పింది.

Chaari 111 : ఏజెంట్ లుక్ లో వెన్నెల కిషోర్.. చారి 111 ఫస్ట్ లుక్ రిలీజ్.

ఆ సమయంలో తాను అర్థరాత్రి వరకు పని ఆడిషన్స్ ఇస్తూ తిరిగే దాన్నని, క్యాబ్‌లో సూట్‌కేస్‌తో ఎక్కడికైనా వెళ్లేదాన్నని దీపిక చెప్పుకొచ్చింది, చాలా సార్లు ఆమె క్యాబ్‌లోనే పడుకునేదాన్నని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో దీపిక వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడింది. తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో క్వాలిటీ టైం గడపడం చాలా ముఖ్యం అని ఆమె చెప్పింది. ఆమె ఎప్పుడూ తన పని పక్కన పెట్టి భర్తతో సమయాన్ని వెచ్చించి ఆనందిస్తుంది. చాలా సార్లు పని కారణంగా తమకు సమయం దొరకడం లేదని ఆమె భావిస్తారు. దీపికా మాట్లాడుతూ మేము కలిసి సమయాన్ని గడపడం నాకు ఇష్టం, మేము కూడా మా కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతామని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే దీపికా పదుకొణె త్వరలో ఫైటర్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె హృతిక్ రోషన్‌తో కలిసి కనిపించనుంది.ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది.

Show comments