Site icon NTV Telugu

Deepavali: ఆసక్తికరంగా ‘దీపావళి’ ట్రైలర్… నవంబర్ 11న తెలుగు, తమిళ్ లో రిలీజ్‌!

Deepavali Movie Trailer

Deepavali Movie Trailer

Deepavali Trailer: అనగనగా ఓ మేక, దేవుడికి మొక్కుకున్న మేక అది, దాని పేరు అబ్బులు. ఆ మేక అంటే ఇంట్లో ఉండే చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు, అయితే… దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది, ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘దీపావళి’ సినిమాకి ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులుగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదమే ఈ ‘దీపావళి’. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పాల్గొని ప్రశంసలు అందుకోగా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.

Mahar Yodh 1818: ‘కోరేగావ్ యుద్ధం’పై సినిమా.. ఫాంటసీ థ్రిల్లర్ గా!

తాజాగా ఉస్తాద్ రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూస్తే పల్లెటూరి నేపథ్యంలో ‘దీపావళి’ తెరకెక్కించారు, ఇందులో. పల్లెలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సహజంగా ఆవిష్కరించారు. తాత, మనవడు, మేక మధ్య బంధాన్ని బలంగా చూపించే ప్రయత్నం చేశారు. దీపావళి పండక్కి కొత్త డ్రస్ కొని ఇవ్వమని మనవడు అడగడంతో మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతాడు, కానీ మొక్కుబడి మేక కావడంతో ఊరి జనాలు దానిని కొనడానికి ముందుకు రారు అదే సమయంలో కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని వీరబాబు ఆ మేక కొనడానికి రెడీ అవుతాడు కానీ ఆ తర్వాత మేకను మరొకరు దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైందనేది సినిమా చూడల్సిందే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మేకకు ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు సప్తగిరి వాయిస్ ఇచ్చారు.

Exit mobile version