Deenamma jeevitham Movie Trailer Launched: దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రలలో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దీనమ్మ జీవితం’. వై. మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి సోనియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ నా మొదటి సినిమా ‘ప్రేమ పిపాసి’ విడుదలైన సమయానికి కరోనా లాక్ డౌన్ వచ్చింది, అప్పుడే దీనమ్మ జీవితం అనిపించింది.
Deepika Padukone : దీపికా పదుకొనే ఖాతాలో మరో బ్రాండ్..
అయితే నాకు తెలిసింది సినిమానే, ఎలాగైనా మళ్ళీ సినిమా చేయాలని సంకల్పించుకున్నానని అన్నారు. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ లాంటి రా ఫ్యామిలీ మా ‘దీనమ్మ జీవితం’, చాలా డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న సినిమా మాదని అన్నారు. మలయాళం, తమిళ్ పరిశ్రమలే కాదు తెలుగులో కంటెంట్ తో సినిమా చెప్పగలరని నిరూపించే సినిమా దీనమ్మ జీవితం అని అన్నారు. ఇక హీరో దేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం అంతా చాలా శ్రమించామని, దర్శకుడు మురళి రామస్వామి నన్ను చక్కగా తీర్చిదిద్దారన్నారు. హీరోయిన్ ప్రియా చౌహాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది, సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. సతీష్ డీవోపీగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ సంగీతం అందిస్తున్నారు.