December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్

December Slot

December Slot

సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్స్ కన్నా.. ఇప్పుడు డిసెంబర్ సీజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ స్లాట్‌గా మారింది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలీడేస్‌ను టార్గెట్ చేస్తున్నాయి మూవీస్. లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి బాగా కలిసి రావడంతో సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ఈ డిసెంబర్‌పై అఫీషియల్‌గా కర్చీఫ్ వేశారు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్స్. ముందుగా ఫౌజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు ప్రభాస్. నెవ్వర్ బిఫోర్ అవతార్‌లో డార్లింగ్‌ను చూపించబోతున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫౌజీ.

క్రిస్మస్‌ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ నుండి షారూఖ్ కింగ్ వస్తుంటే.. టాలీవుడ్ కింగ్ నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ కింగ్ 100తో మంత్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్‌లో విలన్ రోల్స్‌కు షిఫ్టైన నాగ్.. గ్యాప్ తీసుకుని హీరోగా వస్తున్నాడు. తమిళ్ ఫిల్మ్ మేకర్ రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కింగ్ 100 డిసెంబర్ 24న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ నుండి కూడా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు కూడా ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తారని టాక్.

ఇక నటసింహం బాలయ్య కూడా తన 111కే క్రిస్మస్ మంత్‌లోకి దూసుకొస్తున్నాడని సమాచారం. ఈ రోజు  ఈ సినిమా టైటిల్ రివీల్‌కు టైం ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తారు. నాగ్‌తో పోటీగా వస్తున్నాడని టాక్. కింగ్100,దాదా లోకల్‌గా రిలీజైతే నందమూరి, అక్కినేని వారసుల ఫైట్ గా చూడాల్సి వస్తుంది. పాన్ ఇండియా రిలీజైతే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఫైట్‌గా మారుతుంది. చూడాలి ఈ ఇయర్ ఎండింగ్ సౌత్ వర్సెస్ నార్త్ హీరోల్లో తమ సినిమాలతో ఎవరు భారీ వసూళ్లు సాధిస్తారో..? ఎవరు టాప్ చెయిర్‌లో కూర్చుంటారో..?