NTV Telugu Site icon

Lady Superstar: విజయశాంతి ప్రకటించిన ‘డెడ్ లైన్’!

Vijaya Shanthi

Vijaya Shanthi

 

విద్యార్థి దశలోనూ, సినిమా దర్శకత్వంలోనూ పరుచూరి గోపాలకృష్ణ శిష్యుడు ‘రమణారెడ్డి’! లాంగ్ ఎగో…. లాంగ్ లాంగ్ ఎగో అనే కామెడీ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రమణారెడ్డి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించడమే కాదు… దర్శకత్వం కూడా చేశారు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘డెడ్ లైన్’. ఈ సినిమాలో తన పేరును బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్. అని తెర మీద వేసుకుంటున్నాయన. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలు పోషించిన ‘డెడ్ లైన్’ మూవీని తాండ్ర గోపాల్ నిర్మించారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నఈ సినిమా టీజర్ ను లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇటీవల విడుదలచేశారు. దర్శకుడు రమణారెడ్డి తనకు నటుడిగా ఉన్నప్పటి నుండి పరిచయమే నని, అతనితో కలిసి కొన్ని సినిమాలలో నటించానని ఆమె అన్నారు. ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక అకృత్యాల నేపథ్యంలో చక్కటి సందేశంతో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీని తెరకెక్కించినట్టు బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్. తెలిపారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రచయిత, నటుడు సంజీవి కూడా పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Show comments