Site icon NTV Telugu

DD Next Level : ‘డీడీ నెక్ట్స్ లెవ‌ల్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

Dd Next Lavel

Dd Next Lavel

తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్-కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ మే 16న థియేటర్లలో విడుదలై అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. సంతానం ప్రధాన పాత్రలో నటించగా, సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక తాజాగా ఈ మూవీ OTT విడుదలకు సిద్ధమైంది.

Also Read : The Delhi Files : ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ టీజర్‌కు డేట్ టూ టైం ఫిక్స్..

ప్రముక ఓటీటీ సంస్థ ZEE5 లో జూన్‌13 నుంచి తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో ‘డీడీ నెక్ట్స్ లెవ‌ల్’ స్ట్రీమింగ్ కానున్నట్లు మెకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక కథ విషయానికి వస్తే.. కిస్సా అనే పాత్రలో సినిమా విమర్శకుడిగా నటించారు సంతానం. ఇందులో కొత్త సినిమాలకి ఆయన నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. అయితే మీ కోసం స్పెషల్ షో వేస్తున్నాం థియేటర్ కి రండి అని ఫోన్ వస్తుంది. దీంతో ఎంతో ఉత్సహంగా సినిమా చూడటానికి వెళ్తాడు సంతానం. అక్కడికి వెళ్ళాక అది దెయ్యాలున్న థియేటర్ అని తెలుస్తుంది. ఆ థియేటర్ లోకి వెళ్తే బయటకు రాలేం. అంతలా దెయ్యాలు అడ్డుకుంటాయి..  మరి ఆ దెయ్యానికి చిక్కిన సంతానం  బయటపడ్డాడా లేదా అనేది మిగతా కథ.

Exit mobile version