NTV Telugu Site icon

Dasara Teaser: ఏయ్.. బాంచత్ .. నాని నట విశ్వరూపం

Dasara

Dasara

Dasara Teaser: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దసరా. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో నాని నటవిశ్వరూపం చూపించేశాడు. డీ గ్లామరస్ రోల్ లో పక్కా నాటు కుర్రాడిగా అదరకొట్టేశాడు. ” వీర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి చూస్తే కానీ.. కనిపించని ఊరు ” అంటూ నాని వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. బొగ్గు గనుల మధ్య ఉన్న ఒక పల్లెటూరులో జరిగిన కథనే దసరా.. కథ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ నాని యాక్షన్ తో అదరగొట్టేసాడని తెలుస్తోంది.

ఇక విలన్ గా సాయి కుమార్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ మొత్తం నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.. ఆ ఊర మాస్ లుక్, స్వాగ్.. ఇప్పటివరకు చూడని నానిని ఈ సినిమాలో చూడనున్నారు ప్రేక్షకులు.. ఇక చివర్లో నాని చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. సంతోష్ నారాయణ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటింగ్ స్కిల్స్ టీజర్ పైనే కాదు సినిమాపైనే ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ లో కీర్తి సురేష్ మాత్రం కనిపించకపోవడం అభిమానులను కొద్దిగా అసహనానికి గురిచేస్తోంది. మొత్తం నాని యాక్షన్ కట్స్ తో నింపేశాడు శ్రీకాంత్. ఇకపోతే ఈ సినిమా మార్చి 30 న రిలీజ్ కానుంది. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments