NTV Telugu Site icon

Dasara: ఎట్లైతే గట్లయ్యింది… దేశం మొత్తం మన సౌండ్ వినపడాలే…

Dasara

Dasara

సినిమాని భారి బడ్జట్ తో, హ్యుజ్ స్టార్ కాస్ట్ తో, స్పెక్టాక్యులర్ విజువల్స్ తో తెరకెక్కించడమే కాదు ఒక సినిమాని ఎలా ప్రమోట్ చెయ్యాలో కూడా రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. మార్కెటింగ్ లో రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీని మ్యాచ్ చేసే వాళ్లు ఇండియాలోనే లేరు. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ సమయంలో కూడా PVR చైన్ తో టైఅప్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి, దేశవ్యాప్తంగా ఉన్న PVR థియేటర్స్ ని PVRRRగా మార్చేసాడు. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యే వరకూ ప్రతి PVR థియేటర్ బోర్డ్ లో PVRRR అనే పేరు మాత్రమే ఉండేది. మల్టీప్లెక్స్ లకి ఆడియన్స్ ఎక్కువగా వెళ్తున్న జనరేషన్ కాబట్టి ఈ పేరు మార్చే ప్రమోషనల్ స్టంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఇలాంటి స్ట్రాటజీనే వేశాడు నేచురల్ స్టార్ నాని. రీజనల్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన నాని, పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి చేస్తున్న సినిమా ‘దసరా’.

సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే రిలీజ్ అయిన దసరా టీజర్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కల్ట్ సినిమా చూడబోతున్నాం అనే నమ్మకాన్ని కలిగించిన మేకర్స్, నేషనల్ వైడ్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా చెయ్యాలి కాబట్టి దసరా సినిమా కోసం స్పెషల్ ప్లాన్ చేశారు. దసరా సినిమా మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ వరకూ ఇండియాలోని ముఖ్యమైన 39 నగరాల్లో కౌంట్ డౌన్ స్క్రీన్ ని పెట్టనున్నారు. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సంధర్భంగా ఈ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చెయ్యనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల ఆడియన్స్ దృష్టిలో కూడా దసరా సినిమా పడే ఛాన్స్ ఉంది.

Show comments