NTV Telugu Site icon

Darshan Son: బూతులు, అసభ్య కామెంట్లకు థాంక్స్.. దర్శన్ కొడుకు ఎమోషనల్

Darshan Son

Darshan Son

Darshan Son Vinish Instagram Post On His Father Arrest: రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సమయంలో దర్శన్ గురించి శాండిల్ వుడ్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దర్శన్‌కు అభిమానులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దర్శన్ తనయుడు వినీష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ఘటనపై ఇప్పటిదాకా దర్శన్ తల్లి మీనా తూగుదీప, తండ్రి దినకర్ తూగుదీప ఇప్పటిదాకా స్పందించ లేదు. ఈ సమయంలోనే దర్శన్ భార్య విజయలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. ఇక వినీష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.“నేను 15 ఏళ్ల అబ్బాయిని. మీరు నా భావాల గురించి ఆలోచించకుండా తప్పుడు కామెంట్లు చేశారు, బూతు పదాలు, దారుణమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, వారందరికీ ధన్యవాదాలు, కష్ట సమయాల్లో నన్ను తిట్టడం వల్ల ఏమీ మారదు ”అని అంటూ నటుడు దర్శన్ కుమారుడు వినీష్ సోషల్ మీడియా పోస్ట్‌లో కామెంట్ చేశాడు.

Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ

దర్శన్ కొన్నేళ్లుగా చాలా వివాదాలను ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పటి వరకు స్పందించని వినేష్ ఈసారి స్పందించాడు అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉంటుందో వినేష్ మనసును ఎంత ప్రభావితం చేసి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది దర్శన్ దృష్టికి వెళ్లి రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు పిలిపించారు. ఆ అనంతరం రేణుకాస్వామి హత్య జూన్ 8వ తేదీ రాత్రి జరిగింది. ఆ తర్వాత మృతదేహాన్ని బెంగళూరులోని ఒక కాలువలో పడేశారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని సెక్యూరిటీ గార్డు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులను విచారిస్తున్నారు. దర్శన్, పవిత్ర గౌడలకు బెయిల్ వస్తుందా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. .

Show comments