NTV Telugu Site icon

Darshan: కాటేరా ట్రైలర్ ఊరమాస్ గా ఉంది…

Kaatera

Kaatera

కన్నడ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ హీరోల్లో D Boss దర్శన్ ఒకడు. పాన్ ఇండియా మార్కెట్ లేదు కానీ దర్శన్ పాన్ ఇండియా హీరోల స్థాయిలో ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ గా క్రాంతి మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్, యావరేజ్ హిట్ కొట్టాడు. ఈసారి అలా కాకుండా సాలిడ్ హిట్ కొట్టడానికి డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి తరుణ్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. #D56 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి ‘కాటేర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతూనే ఉన్నాయి. కాటేరా సినిమాపై ఉన్న హైప్ ని మరింత పెంచుతూ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో దర్శన్ ఫైట్స్ అదరగొడుతున్నాడు, రైతుల గురించి చేసిన సినిమాలా కనిపిస్తోంది.

జగపతి బాబు కాటేరా సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు, ట్రైలర్ లో జగ్గు భాయ్ లుక్ కొత్తగా ఉంది. ట్రైలర్ ఎండ్ లో దర్శన్ ఓల్డ్ గెటప్ లో కనిపించాడు. ఆ సీన్ ఇంటర్వెల్ కి సంబంధించింది అయితే కాటేరా కన్నడ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటీ. ఇటీవలే ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ దర్శన్ చాలా కాన్ఫిడెంట్ గా ఇది రీజనల్ సినిమా, ఇక్కడి ఆడియన్స్ కోసం చేసిన సినిమా అని తేల్చి చెప్పాడు. మరి కన్నడ ఆడియన్స్ కి కాటేరా ఎంతవరకు నచ్చుతుంది అనేది చూడాలి. దర్శన్ మాస్ సినిమా చేస్తే హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అక్కడి ఆడియన్స్ లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని కాటేర సినిమా ఎంతవరకు నిలబెడుతుందో లేదో తెలియాలి అంటే డిసెంబర్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

Show comments