NTV Telugu Site icon

Dhamaka: ఇది మాస్ మహారాజ ఊరమాస్ జాతర…

Danda Kadiyal

Danda Kadiyal

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని మేకర్స్ విడుదల చేశారు. ముందొచ్చిన ‘జింతాక్’ పాటలో ఉన్న జోష్ కన్నా 100 రెట్ల ఎక్కువ ఎనర్జీ ఈ ‘దండ కడియాల్’లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మరో అదిరిపోయే మాస్ నంబర్ ఇచ్చాడు. థియేటర్స్ లో ‘దండ కడియాల్’ సాంగ్ రవితేజ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేయడం గ్యారెంటి.

ఈ ‘దండ కడియాల్’ సాంగ్ కి భీమ్స్ సెసిరోలియో  లిరిక్స్ రాసి… ‘సాహితీ చాగంటి’, ‘మంగ్లీ’తో కలిసి పాడడం విశేషం. సాంగ్ ఏ సూపర్ గా ఉంది అంటే, లిరికల్ వీడియోలో అక్కడక్కడ చూపించిన డాన్స్ బిట్స్ ఇంకా బాగున్నాయి. ‘జానీ మాస్టర్’ మాస్ మహారాజ కోసం సూపర్ స్టెప్స్ ని కంపోజ్ చేశాడు, సాంగ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. రవితేజ సాంగ్ లో మాంచి జోష్ లో కనిపించాడు, శ్రీలీలా డాన్స్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో ఉంది.  ‘దండ కడియాల్’ సాంగ్ తో ధమాకా సినిమా ఖాతాలో మరో చార్ట్ బస్టర్ చేరింది. ఇక సాంగ్ లో రవితేజ ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ ధమాకా ట్రైలర్ ని డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ‘ధమాకా’ సినిమాని రవితేజ ముందెన్నడూ లేనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. చిత్ర యూనిట్ అంతా షోస్, ఈవెంట్స్ కి వెళ్తుంటే… ఎప్పుడూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో, కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ లో మాత్రమే మాట్లాడే రవితేజ ఈసారి ‘ధమాకా’ సినిమాని ముందుండి ప్రమోట్ చేస్తున్నాడు. నెల రోజుల ముందు నుంచే రవితేజ ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. మరి ఈ మూవీతో మాస్ మహారాజ్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Show comments