NTV Telugu Site icon

Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో హైలైట్ ఎపిసోడ్ అదేనట

Daakumaharaaj (2)

Daakumaharaaj (2)

Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన తన తాజా చిత్రం డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also:Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం

సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ సాధించింది . ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాత నాగవంశీ. ఈ నెల 23న అంటే నేడు చిన్ని అనే సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Read Also:Indian American: డొనాల్డ్ ట్రంప్‌ పాలకవర్గంలో మరో భారత్- అమెరికన్‌..

ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్య సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో చాందినీ చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో జనవరి 4న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.