NTV Telugu Site icon

‘బంగార్రాజు’ కోసం బరిలోకి దిగిన మరో హాట్ బ్యూటీ

bangarraju

bangarraju

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. క్యాన్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ చిట్టి ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమాలో మరో హిట్ బ్యూటీ రచ్చ చేయడానికి రెడీ అయ్యింది. హుషారు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి జాంబీ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దక్ష నగార్కర్ బంగార్రాజు చచిత్రంలో అక్కినేని సోగ్గాళ్ళతో చిందులు వేయనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. నాగ చైతన్య చాలా కూల్ పర్సన్.., నాగార్జున డౌన్ తో ఎర్త్ పర్సన్ అని చెప్పుకొచ్చిన బ్యూటీ బంగార్రాజు లో నటించడం అద్భుతమని చెప్పుకొచ్చింది. మరి అమ్మడు ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకోనున్నదో.

Show comments