Site icon NTV Telugu

మాస్ మహారాజాకే విలనిజం చూపిస్తానంటున్న హాట్ బ్యూటీ

ravanasura

ravanasura

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారాడు. ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర‘ జనవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.

https://ntvtelugu.com/srihan-deleting-siri-pics-instagram/

ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం హాట్ బ్యూటీ దక్ష నగార్కర్ ని తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో అమ్మడు విలన్ పాత్రలో కనిపించనున్నదట. నెగెటివ్ షేడ్స్ పాత్రలో రవితేజ కి ధీటుగా నటించనున్నదట. ఇప్పటికే జాంబీ రెడ్డి చిత్రంలో అమ్మడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినా సంగతి తెలిసిందే. మరి ఈ అందాల భామ విలనిజం ఏ రేంజ్ లో పండిస్తుందో చూడాలి.

Exit mobile version