Site icon NTV Telugu

Daggubati Family Pic: కుటుంబం… దగ్గుబాటి కుటుంబం- ఎంత ముచ్చటగా ఉన్నారో చూశారా?

Daggubati Family Pic

Daggubati Family Pic

Daggubati Family Pic Goes Viral at Abhiram Marriage: ఇటీవల దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు, హీరో రానా తమ్ముడు అహింస సినిమాతో హీరోగా మారిన దగ్గుబాటి అభిరామ్ వివాహం చేసుకున్నాడు. దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువులమ్మాయి ప్రత్యూషని శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వివాహం చేసుకున్నాడు. మాములుగా రానా పెళ్లిని ధూమ్ ధామ్ గా చేశారు కానీ అభిరాం పెళ్లిని మాత్రం చాలా సైలెంట్ గా మమ అనిపించేశారు. అభిరామ్ పెళ్లి నుంచి ఒక ఫోటో తప్ప ఇంకేమి బయటకు రాకుండా ఫ్యామిలీ జాగ్రత్త పడింది. ఇక పెళ్లి తరువాత దగ్గుబాటి ఫ్యామిలీ హైదరాబాద్ లో ప్రత్యక్షం అయి ఎయిర్ పోర్ట్ లో కనబడిన విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి ఊహించని గెస్ట్.. ప్లానింగ్ వేరే లెవల్ అంతే!

తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలో సురేష్ బాబు – ఆయన భార్య, వెంకటేష్ -ఆయన భార్య, వెంకటేష్ పిల్లలు, రానా- ఆయన భార్య, నాగచైతన్య, మరి కొంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలా దగ్గుబాటి ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. ఇక ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్లో ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పరాజయం పాలైన క్రమంలో కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి పెళ్లి సైలెంటుగా కానిచ్చేసినా తెలుగు సినీ పెద్దల కోసం ఏమైనా రిసెప్షన్ లాంటివి ఏర్పాటు చేస్తారేమో చూడాలి.

Exit mobile version