Site icon NTV Telugu

Dada Saheb Phalke Awards 2023: అవార్డు విజేతలు వీళ్లే…

Dada Saheb Phalke Awards

Dada Saheb Phalke Awards

భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా 2022 ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’లని అనౌన్స్ చేశారు. రణబీర్, అలియా భట్ లు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులని అందుకోగా బెస్ట్ సినిమా అవార్డుని వివాదాస్పద ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సొంతం చేసుకుంది. ఇతర అవార్డీల వివరాలు…

సినిమా విభాగంలో…

ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌
ఉత్తమ దర్శకుడు: ఆర్‌.బాల్కి (చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)
ఉత్తమ నటుడు‌: రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)
ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌శెట్టి (కాంతారా)
క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌: వరుణ్‌ ధావన్‌ (బేడియా)
మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌
బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్ తాండన్‌
క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌ (జల్సా)
ఉత్తమ సహాయ నటుడు: మనీష్‌ పాల్‌ (జగ్‌ జగ్‌ జీయో)
ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆర్‌ఆర్‌ఆర్‌

టెలివిజన్‌ విభాగంలో..

ఉతమ నటుడు: జైన్‌ ఇమనాన్‌
ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాశ్‌
ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా

వెబ్‌ సిరీస్‌ విభాగంలో..

ఉత్తమ వెబ్‌సిరీస్‌: రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌
ఉత్తమ నటుడు: జిమ్ షార్బ్ (రాకెట్‌ బాయ్స్‌)
టెలివిజన్‌ సిరీస్ ఆఫ్‌ ఆది ఇయర్‌: అనుపమ (సీరియల్‌)

Exit mobile version