ప్రదీప్ రంగనాథ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ టుడే’ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళనాడులో 70 కోట్ల వరకూ రాబట్టిన ఈ మూవీ, తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. యంగ్ లవర్స్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో వారి ఫోన్స్ ని మార్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇద్దరికీ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది లవ్ టుడే సినిమా కథ కథనం. యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ మూవీ లాంటి సినిమానే కోలీవుడ్ లో మరొకటి రిలీజ్ అయ్యింది. కవిన్ రాజ్, అపర్ణ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పేరు ‘డాడా’. గణేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. యూత్ ఈ మూవీని చూడడానికి థియేటర్స్ కి క్యు కడుతున్నారు. లవ్ టుడే సినిమా పెళ్లికి ముందు జరిగే కథతో తెరకెక్కితే ‘డాడా’ పెళ్లి తర్వాత జరిగే కథతో రూపొందింది.
ఇందులో హీరో, హీరోయిన్ కాలేజ్ డేస్ నుంచే ప్రేమలో ఉంటారు. అనుకోని పరిస్థితిలో హీరో, హీరోయిన్ మధ్య రోమాన్స్ జరిగి హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. కాలేజ్ ఫైనల్ ఇయర్ సమయంలోనే ప్రెగ్నెన్సీ అంటే ఇబ్బందులు వస్తాయి అని తెలిసి హీరో, హీరోయిన్ తో కలిసి ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉంటాడు. ఈ సమయంలో హీరో-హీరోయిన్ కి మధ్య మనస్పర్ధలు రావడంతో హీరోయిన్ ఒక బాబుకి జన్మనిచ్చి హీరోకి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ బాబుని పట్టుకోని హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది ‘డాడా’ కథ. ఒక ఎమోషనల్ కథకి, చాలా జాగ్రత్తగా ఫన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి ‘డాడా’ సినిమాని చాలా ఎంగేజింగ్ గా రూపొందించారు. అందుకే ఈ మూవీ యూత్ ని అంతలా నచ్చుతుంది. తమిళనాడులో హిట్ అయిన సినిమా తెలుగులో డబ్ అవ్వడం మాములే కాబట్టి ‘డాడా’ సినిమా డబ్బింగ్ రైట్స్ ని ఎవరు సొంతం చేసుకోని రిలీజ్ చేస్తారు అనేది చూడాలి.
