డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, డిసెంబర్ 22న ప్రభాస్… డంకీ అండ్ సలార్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇండియన్ సినిమా ఇప్పటివరకూ చూడని బిగ్గెస్ట్ క్లాష్ అనే చెప్పుకోవాలి. ప్రభాస్ vs షారుఖ్ ఖాన్ వార్ లో చిన్న సినిమాలు చితికిపోతాయి అని విడుదలని వాయిదా వేసుకుంటున్నాయి. ఈ ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమవుతుంటే… ఈ సినిమాల కన్నా వారం తర్వాత తన సినిమాని రిలీజ్ చేస్తున్న కన్నడ స్టార్ హీరో డీ బాస్ దర్శన్ మాత్రం క్లాష్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. కాటేరా సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న దర్శన్… ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “ఆ సినిమాల గురించి మనం ఎందుకు భయపడాలి. ఇది మన గడ్డ, మనతో పోటీ పడాలంటే వాళ్లు భయపడాలి” అంటూ కామెంట్స్ చేసాడు. దర్శన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్… అంత ధైర్యం ఉంటే వారం తర్వాత ఎందుకు డిసెంబర్ 22నే కాటేరా రిలీజ్ చెయ్యాల్సింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సలార్, డంకీ సినిమాలు పాన్ ఇండియా మూవీస్… ఇవి ఒక రీజన్ కి మాత్రమే లిమిట్ చేసి చూడకూడదు. ఈ మధ్య అసలు ఇండియాలో రీజనల్ సినిమా అనే మాటే లేదు, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కన్నడ నుంచి వచ్చిన చార్లీ 777, సప్త సాగరాలు దాటి లాంటి చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా హిట్స్ అయ్యాయి. సినిమా అనేది గ్లోబల్ అయిపోతున్న సమయంలో ‘ఇది మన గడ్డ” అనే రొటీన్ డైలాగులని దర్శన్ లాంటి స్టార్ హీరో చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా కాటేరా సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది… ఈ వారం గ్యాప్ లో సలార్ అండ్ డంకీ సినిమాల జాతకం ఏంటో తెలిసిపోతుంది. ఒకే రోజు క్లాష్ ఉంటే సరేలే థియేటర్స్ దొరకక అలా మాట్లాడి ఉంటాడు అనుకోవచ్చు. ఆ సమస్య లేనప్పుడు కాస్త సైలెంట్ గా ఉంటే అయిపోతుంది, లేదంటే ఇలానే వైరల్ అవ్వాల్సి వస్తుంది. దర్శన్ ఇలా సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ గురించి కూడా ఇలానే నెగటివ్ కామెంట్స్ చేయడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద వివాదమే జరిగింది.
