NTV Telugu Site icon

Darshan: బాస్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది…

Darshan Katera

Darshan Katera

కన్నడ సినీ అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని పిలుచుకునే స్టార్ హీరో ‘దర్శన్’. ఇతర కన్నడ హీరోల్లాగా దర్శన్ మార్కెట్ ని పెంచుకోని ఇతర భాషల సినీ అభిమానులకి ఇంకా రీచ్ అవ్వలేదు కానీ శాండల్ వుడ్ లోని టాప్ హీరోస్ లో దర్శన్ టాప్ 5లో ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న యష్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందులో ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది KFIలో దర్శన్ ఫ్యాన్ బేస్. మన దగ్గర పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా సినిమాలు చెయ్యలేదు కానీ పాన్ ఇండియా హీరోల రికార్డులని కూడా రీజనల్ సినిమాలతోనే బ్రేక్ చేసే అంత రేంజ్ పవన్ కళ్యాణ్ కి ఉంది. దర్శన్ కూడా ఈ కేటగిరికి చెందిన హీరోనే, అంతటి స్టార్ హీరో అయిన దర్శన్ ‘క్రాంతి’ సినిమాతో ఈ రిపబ్లిక్ డేకి ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్ సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. రెండు వారాల్లో క్రాంతి సినిమా 35 కోట్ల షేర్ ని రాబట్టి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి 2023లో మంచి స్టార్ట్ ఇచ్చింది.

క్రాంతి మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్ లో దర్శన్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పీరియాడిక్ సినిమాకి తరుణ్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకూ #D56 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రమోట్ అయిన ఈ మూవీకి ‘కాటేర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దర్శన్ పుట్టిన రోజు కావడంతో, అతని బర్త్ డే గిఫ్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. బాస్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది అంటూ దర్శన్ అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ‘కాటేర’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్ లో కత్తి పట్టుకోని దర్శన్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. దర్శన్ మాస్ సినిమా చేస్తే హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అక్కడి ఆడియన్స్ లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని కాటేర సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

Show comments