Jeevitha Rajashekar: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. పెట్టుబడులు పేరిట, ఇతర వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్ల లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. వాటిని నమ్మి అమాయకులు మోసపోతున్నారు. ఇక తాజాగా సినీ నటి జీవితా రాజశేఖర్ సైతం సైబర్ వలలో చిక్కుకుంది. జియో బహుమతుల పేరుతో సినీ నటి జీవిత రాజశేఖర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ నరేష్ అనే వ్యక్తి జీవితా రాజశేఖర్ కు ఫోన్ చేసి ప్రస్తుతం జియోలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై మంచి ఆఫర్ ఉందని, తాను రిఫర్ చేసి మీకు 50 శాతం దాకా రాయితీ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.
దాదాపు ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.2.5 లక్షల విలువ చేసేవి ఆ ఆఫర్ లో కేవలం రూ.1.50 లక్షలకే వస్తాయని నమ్మేలా చెప్పడంతో ఆ మాటలను నమ్మిన జీవితా, మేనేజర్ ద్వారా అతని అకౌంట్ కు లక్షన్నర బదిలీ చేశాడు. ఎప్పుడైతే డబ్బులు అకౌంట్ లో పడ్డాయో అప్పటినుంచి నరేష్ ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో వెంటనే జీవితా, పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెన్నైకి చెందిన నరేష్‌ని అరెస్ట్ చేశారు. గతంలోనూ నటీనటులతోపాటు ప్రొడ్యూసర్స్‌ని నరేష్ మోసం చేసినట్లు ఆధారాలు ఉండడంతో అతడిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.