NTV Telugu Site icon

Cyber attack: మెగాస్టార్ మీద సైబర్ ఎటాక్?

Mammootty Birthday Special

Mammootty Birthday Special

Cyber attack on Mammootty: 2022లో విడుదలైన ‘పుజు’ చిత్రానికి సంబంధించి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సైబర్ దాడులను ఎదుర్కొంటున్నారు. రైట్ వింగ్ మద్దతుదారులు ఈ చిత్రం బ్రాహ్మణ వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. అయితే, లెజెండరీ నటుడికి మద్దతుగా రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల అభిమానులు మరియు ప్రజలు ముందుకు వచ్చారు. నటుడికి మద్దతుగా వచ్చిన మొదటి వ్యక్తులలో విద్యా మంత్రి వి శివన్‌కుట్టి ఒకరు. “అలాంటివి ఇక్కడ పని చేయవు. మమ్ముట్టి కేరళకు గర్వకారణం” అని శివన్‌కుట్టి ఫేస్‌బుక్‌లో ప్రముఖ నటుడితో కలిసి ఉన్న పాత ఫోటోను పంచుకున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన సినిమాపై దాడి జరిగిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమ వారు బయటి వారు పలువురు నటుడికి సంఘీభావం తెలిపారు!

Lekha Washington: స్టార్ హీరో మేనల్లుడి ప్రేమలో వేదం నటి.. విడాకులు కూడా?

“సంఘ్ వారు మమ్ముట్టిని మహమ్మద్ కుట్టి అని పిలుస్తారు, కమల్‌ను కమాలుద్దీన్ అని పిలుస్తారు, విజయ్‌ని జోసెఫ్ విజయ్ అని పిలుస్తారు. వారి రాజకీయం ఎప్పటి నుంచో ఇలానే ఉంది. కానీ ఇక్కడి భూభాగం వేరు. ఇది కేరళ, అలాంటి విద్వేష రాజకీయాలకు ఇక్కడ తావు లేదు’ అని మంత్రి ఎకె రాజన్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. మమ్ముట్టి అంటే మలయాళీ వ్యక్తిగత గర్వం… మమ్ముకతో నిలబడేందుకు మలయాళీకి మతం, రాజకీయాలు అడ్డంకి కాదు.. #సపోర్ట్ మమ్ముట్టి’ అని టి. సిద్ధిక్ ఎమ్మెల్యే ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. మమ్ముట్టి కొత్త చిత్రం టర్బో ఈ నెల 23న విడుదలకు సిద్ధంగా ఉంది. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై మమ్ముట్టి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టి జోస్ పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి, తెలుగు స్టార్ సునీల్ ఈ టర్బోలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Show comments