Site icon NTV Telugu

‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నామినేషన్‌

అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.

మరోవైపు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీవీఎస్‌, ప్రకాశ్‌రాజ్‌ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

ఇకపోతే ‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకీ ఉత్కంఠ పెరిగిపోతోంది. సాధారణ ఎన్నికల వలె, సిని’మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. పైకి అంతా సైలెంట్‌గా ఉన్నా లోపల మాత్రం ఎవరి ప్రచారాలు వాళ్లు చేసుకుంటున్నారు. నిత్యం ఓటర్‌తో టచ్‌లో ఉంటూ తమకే ఓటు వేయాలని, తమ ఫ్యానల్‌నే గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాదు. ప్రతి రోజు వేరు వేరు చోట్ల పార్టీలు ఇస్తూ తమను గెలిపిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. మా ఎన్నిక తేదీ నాటికీ మరింత వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version