NTV Telugu Site icon

Vishwak Sen: ‘కల్ట్’ టైటిల్ అనౌన్స్మెంట్… బేబీ రివెంజా?

Vishwak Sen

Vishwak Sen

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా కూడా మారి సినిమాలు చేస్తూ ఉంటాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఇప్పటివరకూ తన సినిమాలకి మాత్రమే కథలు అందించి దర్శకత్వం చేసుకున్నాడు. ఈసారి మాత్రం కొత్త అవతారం ఎత్తుతూ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు విశ్వక్ సేన్. తన కథతో, తన ప్రొడక్షన్ లో విశ్వక్ ఒక కొత్త సినిమాని అనౌన్స్ చేసాడు. ఒక న్యూ ఏజ్ యూత్ ఫుల్ మూవీగా, అందరూ కొత్త వాళ్లతో ‘కల్ట్’ అనే సినిమా రాబోతుంది అంటూ విశ్వక్ సేన్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇక్కడివరకు అంతబాగానే ఉంది కానీ టైటిల్ దగ్గరే అసలు సమస్య మొదలయ్యింది. కల్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ లో విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ… “ఇదే టైటిల్ తో ఇంకొకరు సినిమా అనౌన్స్ చేసారు, రిజిస్టర్ చేసారు అనే విషయం నాకు తెలియదు. నేను ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసి అనౌన్స్ చేస్తున్నా” అని తేల్చి చెప్పేసాడు. ఇంతకీ అసలు కల్ట్ సినిమా టైటిల్ విశ్వక్ కన్నా ముందు పబ్లిక్ డొమైన్ లో మాట్లాడింది ప్రొడ్యూసర్ SKN. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన SKN… ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కల్ట్ బొమ్మ ఇచ్చాం అనే మాటని తెగ వాడేసాడు. దీంతో ఈ వర్డ్ వైరల్ అయిపోయి ట్రెండ్ అయ్యింది.

SKN ప్రొడ్యూసర్ గా, సాయి రాజేష్ కథతో సంతోష్ శోభన్-అలేఖ్య హారిక జంటగా సుమన్ పాతూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ప్రొడక్షన్-4 అని వేశారు కానీ టైటిల్ వేయలేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ కల్ట్ టైటిల్ ని అనౌన్స్ చేయడంతో SKN బయటకు వచ్చి కల్ట్ బొమ్మ టైటిల్ ని నేను అందరికంటే ముందే రిజిస్టర్ చేయించాను… ఒక బాధ్యతగల ప్రొడ్యూసర్ గా టైటిల్ ని రిజిస్టర్ చేయించకుండా అనౌన్స్ చేయను అని చెప్పేసాడు. సో ఇప్పుడు కల్ట్ అండ్ కల్ట్ బొమ్మ టైటిల్స్ మధ్య వార్ జరుగుతోంది. నిజానికి ఇది టైటిల్ వార్ అనే కాదు విశ్వక్ సేన్-సాయి రాజేష్-SKN మధ్య జరుగుతున్న వార్ అని కూడా అనుకోవచ్చు. బేబీ సినిమా కోసం విశ్వక్ సేన్ ని అడిగితే కనీసం రెస్పాండ్ అవ్వలేదు అంటూ సాయి రాజేష్ ఓపెన్ గానే చెప్పాడు. అప్పటి నుంచి సాయి రాజేష్ అండ్ విశ్వక్ సేన్ లకి పడట్లేదు. కల్ట్ బొమ్మ కథని సాయి రాజేష్ అందిస్తుంటే, కల్ట్ కథని విశ్వక్ అందిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ టైటిల్ వార్ ఎంత దూరం వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.