NTV Telugu Site icon

Salman Khan House Firing : నదిలో దూకి క్రైం బ్రాంచ్‌ సెర్చ్ ఆపరేషన్

Salman Khan

Salman Khan

Crime Branch Conducts Search Operation For Gun Used In Salman Khan House Firing: గత ఆదివారం, ఏప్రిల్ 14, ఉదయం 4:55 గంటలకు సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పులు జరిగాయి. బీహార్‌లోని వెస్ట్ చంపారన్‌కు చెందిన విక్కీ గుప్తా, సాగర్ పాల్ కదులుతున్న బైక్‌పై నుంచి 7 సెకన్లలో సూపర్‌స్టార్ ఇంటిపై 4 బుల్లెట్లు కాల్చి పారిపోయారు. వారిద్దరినీ ఏప్రిల్ 15 అర్ధరాత్రి గుజరాత్‌లోని కచ్‌లో అరెస్టు చేశారు. ఇక కాల్పుల కేసు దర్యాప్తు ప్రస్తుతం సూరత్‌కు చేరుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం సూరత్‌లోని తాపీ నదిలో సోదాలు నిర్వహిస్తోంది. నేరం చేసిన తుపాకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన ముష్కరులిద్దరూ తాపీ నదిలో తుపాకీని విసిరి కచ్‌కు పారిపోయినట్లు విచారణలో అంగీకరించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఈ ఇద్దరు షూటర్లు విక్కీ గుప్తా మరియు సాగర్ పాల్ ఏప్రిల్ 25 వరకు పోలీసు రిమాండ్‌లో ఉండనున్నారు. వీరిద్దరి రిమాండ్ గడువును పొడిగించాలని క్రైం బ్రాంచ్ కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం సూరత్‌లోని తాపీ నది ఒడ్డున క్రైం బ్రాంచ్ బృందం కనిపించింది.

Ashika Ranganath: శారీలో త‌ళుక్కుమ‌న్న‌ ఆషిక రంగనాథ్…

అక్కడ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలో, అర ​​డజనుకు పైగా పోలీసు టీమ్స్ తుపాకి కోసం వెతకడం కనిపించింది. ఈ పనిలో పోలీసు డైవర్లు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. అంతకుముందు, క్రైమ్ బ్రాంచ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, విచారణలో, ఇద్దరు షూటర్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో పరిచయాలు కలిగి ఉన్నారని అంగీకరించారు. విక్కీ, సాగర్‌లు ముంబయి నుంచి ఎలా తప్పించుకుని కచ్‌కు చేరుకున్నారనే దానిపై పూర్తి వివరాలు తెలిపినట్లు పేర్కొంది. అదే క్రమంలో నేరానికి ఉపయోగించిన పిస్టల్ ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించగా.. పట్టుబడతామనే భయంతో తాపీ నదిలో విసిరేశానని సమాధానమిచ్చారని అంటున్నారు. ఇక నేరానికి ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ముంబై నుండి బయలుదేరే ముందు, నిందితులు సాగర్ మరియు విక్కీ బాంద్రాలోని చర్చి వెలుపల మోటారుసైకిల్‌ను విడిచిపెట్టారు. విచారణలో, ఈ బైక్ సెకండ్ హ్యాండ్ అని, మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మోటారు సైకిల్ మాజీ యజమానిని కూడా పోలీసులు విచారించారు.