Site icon NTV Telugu

Vijay Deverakonda and Puri Jagannadh : మరో భారీ ప్రాజెక్ట్… నెక్స్ట్ మిషన్ లాంచ్ ఎప్పుడంటే?

Vijay-Devarakonda

Vijay Deverakonda and Puri Jagannadh కాంబోలో ఇప్పటికే “లైగర్” వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కూడా విజయ్, పూరీ కాంబోలో మరో సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా మూవీ అని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” అని అన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ అనౌన్స్మెంట్ తో అభిమానులను థ్రిల్ చేశాడు.

Read Also : Varun Tej : కొత్త మూవీ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్

ఈరోజు విజయ్ తన కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నాడు. పోస్టర్‌లో అక్షాంశం, రేఖాంశం విలువలు ఉన్నాయి. 14 : 20 అవర్స్, 19.0760 డిగ్రీలు నార్త్, 72,8777 డిగ్రీలు ఈస్ట్, నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ కొత్త సినిమాకు సంబంధించిన లాంచ్ అప్డేట్ ను ఇచ్చాడు. ఇది గూగుల్‌లో చూస్తే ముంబైను చూపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మార్చ్ 29న వెల్లడి కానున్నాయి. కాగా ఇప్పటికే “లైగర్” షూటింగ్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాధ్‌తో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. “లైగర్” మూవీ ఈ ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కానుంది.

Exit mobile version