NTV Telugu Site icon

Premalu 2: మళయాలం మూవీ ‘ప్రేమలు 2’ పై క్రేజీ అప్డేట్..

Untitled Design (14)

Untitled Design (14)

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ప్రేమలు’ ఒకటి. మళయాలంలో క్రిష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ హీరోగా మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ వంద కోట్ల వసూళ్లతో సంచలనంగా మారింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమా కథ ప్రకారం యూత్‌కి బాగా కనుక్ట్ అయింది.

దీంతో హీరోయిన్ మమితా బైజు కి విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. తన అందం, నటన, క్యూట్ నెస్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యరు.సినిమా తర్వాత ,మమితా బైజును.. ప్రేమలు బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక కుర్రాళ్ళు ఈ చిన్నదాని కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ఈ అందమైన ప్రేమకథ, తెలుగు యువతకు తెగ దగ్గరైంది.

అయితే ‘ప్రేమలు’ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు గత ఏడాది అప్‌డేట్ రాగా. ఇక తాజా సమాచారం ప్రకారం జూన్‌లో సినిమా షూటింగ్‌ని ప్రారంభించి డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. షూటింగ్ లొకేషన్లు, నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కొత్త పాత్రలతో పాటు, మరిన్ని భావోద్వేగాలు, ఎమోషనల్ మూమెంట్స్‌ ఈ మూవీలో ఉంటాయని చిత్రబృందం నుండి సమాచారం. దీంతో ‘ప్రేమలు 2’ చిత్రం పై ఉన్న అంచనాలు మరింత పెరిగి పోయాయి. మరి హీరో హీరోయిన్ గా నస్లెన్, మమితా బైజునే నటిస్తారా? లేదా వేరే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అన్నది చూడాలి.