NTV Telugu Site icon

ఆసక్తికరంగా “క్రేజీ అంకుల్స్” ట్రైలర్

Crazy Uncles Official Trailer Out Now

బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం “క్రేజీ అంకుల్స్‌”. గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుద‌ల‌ చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆర్ఆర్ఆర్ – రాజు (రాజా రవీంద్ర), రెడ్డి (మనో) మరియు రావు (భరణి) క్రేజీ కామెడీతో నిండిపోయింది. బండ్ల గణేష్, ప్రవీణ్ నిర్మాతగా, దర్శకుడిగా అదనపు వినోదాన్ని జోడించారు. మొత్తం మీద క్రేజీ అంకుల్స్ ట్రైలర్ పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. అంతేకాకుండా సినిమాపై అంచనాలను పెంచింది.

Read Also : యాక్షన్ కు మారుపేరు అర్జున్!

ఇక ఇప్పటికే 50 లక్షల వ్యూస్ తో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాను మేలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ నెల 19న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

Crazy Uncles Official Trailer | Sreemukhi | Raja Ravindra | Singer Mano | Good Cinema Group