Site icon NTV Telugu

Koratala shiva : క్రేజీ కాంబో.. ఎన్టీఆర్-సాయి పల్లవి..?

Ntr

Ntr

ఎన్టీఆర్-సాయి పల్లవి.. ఈ క్రేజి కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. అదిరిపోయే స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుందనడంలో ఎలా సందేహం లేదు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత పల్లవి మరో సినిమాకు కమిట్ అవలేదు. దాంతో ఇక ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా వినిపించింది. కానీ తాజాగా సాయి పల్లవి.. ఎన్టీఆర్‌తో జోడి కట్టబోతోందని వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా.. ఎట్టకేలకు జూన్‌లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా అలియా భట్‌ని తీసుకున్నట్టు.. చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. కానీ అమ్మడికి పెళ్లై పోవడంతో.. ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలొచ్చాయి. దాంతో ఆ తర్వాత రష్మికను తిసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు అసలెవ్వరు ఊహించని విధంగా.. సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రేజి అప్టేట్ వింటానికి భలేగా ఉంది.. కానీ ఇందులో ఎంత వరకు నిజముందనేదది తెలియాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు సాయి పల్లవి మరో ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. సరైన స్క్రిప్టు, తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం వల్లే.. ఈ బ్యూటీ సినిమాలకు కమిట్ అవడం లేదట.. ప్రస్తుతం అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలో.. యంగ్ టైగర్ ఆఫర్ గనుక అమ్మడి దగ్గరికెళ్తే.. వెంటనే ఓకే చేసే ఛాన్స్ ఉంది. దాంతో దాదాపుగా సాయిపల్లవి, ఎన్టీఆర్ జోడి ఫిక్స్ అయిపోయిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఏదేమైనా ఎన్టీఆర్-సాయి పల్లవి క్రేజీ కాంబో అని చెప్పొచ్చు.

Exit mobile version