CPI Narayana Releases a Video Appealing Pallavi Prashanth to come office: బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలే అనంతరం కంటెస్టెంట్స్ దాడి అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ మీద పలు కేసులు నమోదు కాగా ఇప్పటికే అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక తాజాగా ఈ అంశం మీద సీపీఐ నారాయణ ఒక వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో నారాయణ మాట్లాడుతూ బిగ్ బాస్‌లో పాల్గొన్నవాడిపై కాదు పోలీస్ ప్రతాపం చూపించాల్సింది బిగ్ బాస్ నిర్వహకుల మీద అని అన్నారు. బిగ్ బాస్ మ్యానేజ్‌మెంట్‌పైన, యాంకర్ అయిన నాగార్జునపైన కదా కేసు పెట్టాల్సిందని ప్రశ్నించిన ఆయన అలా కాకుండా బిగ్ బాస్‌లో పాల్గొన్న ఒక రైతుబిడ్డను హింసించడం, కేసు పెట్టడంతో చివరికి వాడు పరారై వెళ్లిపోయాడని అన్నారు.
Pallavi Prashanth: బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. ?
అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు, ఇంకా భయపడి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? అని నారాయణ ప్రశ్నించారు. తక్షణం అతడి మీద ఎలాంటి కేసు లేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్‌గా ప్రకటించాలని, ఆ తర్వాత బిగ్ బాస్ నిర్వాహకులపై, నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. పల్లవి ప్రశాంత్‌కు పొరపాటున ఏమైనా జరిగినా, పోలీసులే బాధ్యత వహించాలని పేర్కొన్న ఆయన సీపీఐ ఆఫీస్‌కు వచ్చేయండి, మీకేం భయం లేదు అని ఆ అబ్బాయికి అప్పీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. మా ఆఫీసుకు వస్తే మేము చూసుకుంటాం, మిమ్మల్ని అరెస్టు చేయడానికి ఎవరూ ముందుకు రారు, మేము హామీ ఉంటాం అని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇంతలోనే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది.