కార్తీక్ సాయి హీరోగా పరిచయవుతున్న సినిమా ‘కార్తీక్స్ ది కిల్లర్’. డాలీషా, నేహా దేశ్ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చిన్నా దర్శకత్వంలో ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవరావు సంయుక్తంగా నిర్మించారు. అయితే… శుక్రవారం థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనను ఆపాల్సిందిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ను ఇచ్చింది. తాను రాసుకున్న కథ, కథనాలను ఆధారంగా చేసుకుని, ‘కార్తీక్స్ ది కిల్లర్’ సినిమాను నిర్మించారని రచయిత కెనాజ్ కోర్టులో ఆధారాలను చూపించగా, ప్రాధామిక విచారణ జరిపిన అనంతరం కోర్టు ఈనెల 21 వరకూ సినిమాను విడుదల చేయవద్దంటూ స్టే ఆర్డర్ ఇచ్చినట్టు ఫిర్యాదుదారుని లాయర్ తెలిపారు.
‘కార్తీక్స్ ది కిల్లర్’ సినిమా విడుదలపై కోర్ట్ స్టే!

Karthiks the killer