Site icon NTV Telugu

Court Movie : అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ‘కోర్టు’ మూవీ

Court Movie

Court Movie

Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వచ్చిన కోర్టు మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి భారీ లాభాలతో దూసుకుపోతోంది. కొత్త సినిమాలు వచ్చినా కోర్టు మూవీకి కలెక్షన్లు తగ్గలేదు. అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు పెద్ద సినిమాలు మాత్రమే ఈ రికార్డును క్రియేట్ చేయగా.. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన కోర్టు సినిమా ఈ లిస్టులో చేరింది.

Read Also : MI vs KKR: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్.. 8 వికెట్లతో భారీ విజయం.

ఇందులో శివాజీ, ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుంది.. ఫోక్సో చట్టం ఎలా ఉంటుంది అనేవి అవగాహన కల్పించారు. మరీ ముఖ్యంగా మంగపతి పాత్రలో శివాజీ చూపించిన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్ర చుట్టూ ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ పాత్ర కరెక్టేనా కాదా అనే వాటిపై డిబేట్లు కూడా జరుగుతున్నాయంటే ఈ సినిమా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా యూనిట్ ను అభినందించారు. ఈ మూవీ లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Exit mobile version